Mahesh Babu: మహేశ్ బాబు‘ఒక్కడు’మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్‌ ఏంటో తెలుసా ?

మహేశ్ బాబు‘ఒక్కడు’మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్‌ ఏంటో తెలుసా ?

Hello Telugu - Mahesh Babu

Mahesh Babu: మహేశ్‌బాబు, భూమిక, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వంలో నటించిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘ఒక్కడు’. 2003లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, మహేశ్‌(Mahesh Babu) కెరీర్‌ లో తొలి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గానూ ఈ సినిమా నిలిచింది. అయితే ఈ సినిమాకు తొలుత వేరే టైటిల్‌ అనుకున్నారట! మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మృగరాజు’ ఫ్లాప్‌ కావడంతో గుణశేఖర్‌ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దీనితో మంచి కథతో సినిమా తీసి తానేంటో నిరూపించుకోవాలని కసితో ఉన్న దర్శకుడు గుణశేఖర్ కు ఓ పత్రికలో వచ్చిన కథనం… ఒక్కడు స్టోరీ బీజం వేసిందట.

Mahesh Babu…

ఒకరోజు పేపర్‌ లో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పుల్లెల గోపీచంద్‌ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ల తండ్రికి క్రీడలంటే ఆసక్తి లేకపోవడం, గోపీచంద్‌ ఎన్నో కష్టాలు పడి స్పోర్ట్స్‌ ఛాంపియన్‌గా ఎదగడం ఇదంతా గుణశేఖర్‌ కు ఎంతో ఆసక్తికరంగా, స్ఫూర్తివంతంగా అనిపించింది. దీనితో తన కథలో హీరో కూడా ఇలాంటివాడిగానే ఉండాలని, తండ్రి వద్దంటున్నా స్పోర్ట్స్‌లో ఎదగాలనుకుంటాడని స్క్రిప్ట్‌ రాసుకున్నారు. వెళ్లి మహేశ్‌(Mahesh Babu)ను కలిసి కథ చెప్పి ఒప్పించారు. నిర్మాతగా ఎమ్మెస్‌ రాజు సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇక మిగిలింది చార్మినార్‌ సెట్‌. అందుకు కూడా ఎమ్మెస్‌ రాజు ఒప్పుకొన్నారు. కథానాయికగా భూమికను తీసుకున్నారు. అప్పటికి భూమిక ‘యువకుడు’ చేసింది. శేఖర్‌.వి.జోసెఫ్‌ కెమెరామెన్‌.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ.. పరుచూరి బ్రదర్స్‌ రచయితలు.. ఆర్ట్‌ డైరెక్టర్‌గా అశోక్‌.. టీమ్‌ అంతా ఒకే. ఇక మిగిలింది టైటిల్‌.

గుణశేఖర్‌ ఈ సినిమాకు మొదటి నుంచి అనుకుంటున్న టైటిల్‌ ‘అతడే ఆమె సైన్యం’. కానీ ఆ టైటిల్ నుఎవరో రిజిస్టర్‌ చేసేశారు. ఎంత బతిమాలినా ఇవ్వలేదు. ఇంకో టైటిల్‌ వెతుక్కోవాల్సి వచ్చింది. దీనితో ‘కబడ్డీ’ అని పెడదామనుకున్నారు. చివరకు ‘ఒక్కడు’ పేరు నిర్ణయించారు. ఒక్కరు కూడా నో చెప్పలేదు. అందరికీ నచ్చింది. హైదరాబాద్‌ శివారులో చార్మినార్‌ సెట్‌ వేసి సినిమా తీశారు. అలా ‘ఒక్కడు’ సెట్స్‌పైకి వెళ్లింది. ‘‘మృగరాజు’లాంటి ఫ్లాప్‌ తీసిన దర్శకుడు, ‘దేవి పుత్రుడు’లాంటి యావరేజ్‌ సినిమా తీసిన నిర్మాత కలిసి మహేశ్‌తో సినిమా తీస్తున్నారా ? పాపం… మహేశ్‌ పని గోవిందా!’’ అని ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు. మహేశ్‌-గుణశేఖర్‌ అవేవీ పట్టించుకోలేదు. చార్మినార్‌ సాక్షిగా విడుదలైన ‘ఒక్కడు’ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మహేశ్‌ నటన, ప్రకాష్‌రాజ్‌ విలనిజం, పాటలు అన్నీ ప్రేక్షకులను అలరించాయి. రూ.9 కోట్ల నిర్మించిన ఈ చిత్రం ఫుల్‌ రన్‌టైమ్‌లో రూ.39 కోట్లు వసూలు చేసింది.

Also Read : Director Maruthi : ఆ హీరోయిన్ కి స్టార్ హీరో ని కూడా లెక్క చేయనంత పొగరు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com