క్రియేటివిటీకి పెద్ద పీట వేస్తోంది తమిళ సినీ పరిశ్రమ. ఇక్కడ నటీ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతలకు కొదువ లేదు. చెన్నై అంటేనే సినీ లోకం. రంగుల ప్రపంచం. ఇదే రంగం నుంచి వచ్చిన అద్భుతమైన నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తను భిన్నమైన పాత్రలను పోషించాడు. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఏ మాత్రం పట్టించుకోడు. పాత్రలు ముఖ్యం. ఆ తర్వాత దర్శక, నిర్మాతల గురించి ఆలోచించడు.
ఇది తన స్పెషాలిటీ. తన గురించి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అయితే అందరి ముందు జవాన్ సక్సెస్ మీట్ లో విజయ్ సేతుపతిని ఉద్దేశించి సర్ అని పేర్కొన్నాడు. ఒక్కసారిగా అందరినీ విస్తు పోయేలా చేసింది. తన వ్యక్తిత్వానికి భంగం కలిగించే ఏ పాత్రను తను ఒప్పుకోనంటూ బహిరంగంగానే ప్రకటించాడు. సినీ రంగాన్ని ఆశ్చర్య పరిచేలా చేశాడు. తను ప్రస్తుతం ఏస్ చిత్రంలో నటించాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సూపర్ టాక్ తెచ్చుకుంది. తన నటనకు మంచి మార్కులు పడ్డాయి కూడా.
23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఏస్ చిత్రం. 7సి ఎంటర్టైన్మెంట్ పతాకంపై అరుముగ కుమార్ దర్శకత్వం వహించాడు. తనకు జోడీగా రుక్మిణి వసంత్ నటించింది. శివ ప్రసాద్ నేతృత్వంలో శ్రీ పద్మిని సినిమాస్ దీనిని రిలీజ్ చేస్తోంది. ఈ సందర్బంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ప్రతి ఒక్కరు ఏస్ బాగుందంటూ కితాబు ఇచ్చారు. ఏస్ మూవీ బ్లాక్ బస్టర్ కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశాడు నిర్మాత. ఇక విజయ్ సేతుపతి మాట్లాడుతూ మనసు పెట్టి చేశామని, ఆశీర్వదించి ఆదరించాలని కోరారు.