డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాజా సాబ్. దీనిని పీపుల్ మీడియా నిర్మిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. రోజుకో అప్ డేట్ వస్తోంది ఈ సినిమా గురించి. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. ఎందుకనో విడుదలలో జాప్యం జరుగుతోంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ సినివమాను మనసు పెట్టి చేశాడు మారుతి. తను ఏది తీసినా అది తప్పకుండా హిట్ అయి తీరాల్సిందే. తాను సంతృప్తి చెందేంత వరకు ఎన్ని టేకులైనా సరే తీసుకుంటాడు. తెరపై సినిమాను అద్బుతంగా ప్రజెంట్ చేసేందుకు శ్రమిస్తాడు. దీంతో తను దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఇందుకు తగ్గట్టుగానే మారుతి సర్ ప్రైజ్ ఇచ్చాడు. పోస్టర్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేశాడు. సూపర్ గా ఉందంటూ కితాబు వచ్చింది. దీనికి మ్యూజిక్ ఇస్తున్నాడు ఎస్ఎస్ థమన్. రాజా సాబ్ లో కీ రోల్ పోషిస్తోంది మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహన్. డార్లింగ్ ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన జీవితంలో మరిచి పోలేనంటూ పేర్కొంది.
చాలా మంది లాగే తాను కూడా ప్రభాస్ గురించి ఇంట్రావర్ట్ అని అనుకున్నానని, కానీ సెట్స్ లోకి వెళ్లాక తెలిసింది తను మామూలోడు కాదని అని పేర్కొంది. షూటింగ్గ గ్యాప్ లో అన్ని విషయాలు సరదాగా చెప్పాడని, తాను ఫుల్ ఎంజాయ్ చేశానంటూ తెలిపింది . ప్రస్తుతం డార్లింగ్ గురించి మాళవిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.