Popular Actor Tom Chacko :డ్ర‌గ్స్ కేసులో నటుడు టామ్ చాకో అరెస్ట్

త‌న‌పై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని న‌టి ఫిర్యాదు

Popular Actor Tom Chacko

Tom Chacko : డ్రగ్స్ కేసులో మ‌ల‌యాళ‌ న‌టుడు టామ్ చాకోను కొచ్చిలో అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎర్నాకుళం నార్త్ పోలీస్ ఎస్ ఐ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించారు. అతనిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంలోని సెక్షన్లు 27 (ఏదైనా మాదకద్రవ్య లేదా సైకోట్రోపిక్ పదార్థాన్ని తీసుకోవడం) , 29 (ఉత్తేజ పరచడం, నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశామ‌న్నారు.

Tom Chacko Got Drugs Case

మాదకద్రవ్యాల నిరోధక దాడిలో హోటల్ నుండి పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటనకు సంబంధించి విచారణకు హాజరు కావాలని కొచ్చి నగర పోలీసులు చాకోకు(Tom Chacko) నోటీసులు పంపించారు. ఈ నోటీసులు పంపించిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు జరిగడం గ‌మ‌నార్హం. అయితే హొట‌ల్ గ‌ది నుండి పారి పోతుండ‌గా మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ టామ్ చాకోను ప‌ట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను విడుద‌ల చేశారు.

పోలీసుల తెలిపిన ప్రకారం టామ్ చాకో త్రిస్సూర్‌లోని అతని నివాసంలోని కుటుంబానికి నోటీసు ఇచ్చారు. ఆ స‌మ‌యంలో త‌ను అక్క‌డ లేడని తెలిపారు. ఈ సంఘటన ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినందున నోటీసు జారీ చేశామ‌న్నారు ఓ సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్. కాగా త‌న ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడంటూ న‌టి విన్సీ అలోషియ‌స్ ఫిల్మ్ ఛాంబర్, అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)కి ఫిర్యాదు చేసింది.

Also Read : Sonakshi Shocking Comments :విడాకుల‌పై కామెంట్స్ సోనాక్షి సీరియ‌స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com