Malla Reddy : ఆయన ప్రజా ప్రతినిధి. మాజీ మంత్రి కూడా. విద్యా సంస్థలను కూడా నడుపుతున్నారు. కానీ నోరు పారేసు కోవడంలో తనకు మించినోడు లేడని అనుకుంటూ ఉంటారు. అంతే కాదు తాను ఇల్లిల్లు తిరిగి పాలమ్మానని, కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెబుతుంటారు. ఆయన ఎవరో కాదు చామకూర మల్లారెడ్డి. ఈ మధ్యన డ్యాన్సులతో కూడా హోరెత్తిస్తున్నారు. డీజే టిల్లు సాంగ్ కు స్టెప్పులు కూడా వేశారు. జోష్ నింపారు. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మాత్రం పట్టించుకోరన్న విమర్శలు ఉన్నాయి.
Malla Reddy Shocking Comments
తాజాగా మనోడు తాను ఎమ్మెల్యేనన్న సోయి లేకుండా మాట్లాడటం విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. లవ్ యువర్ ఫాదర్ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ కు హాజరయ్యాడు. ఇందులో నటించిన కసి కపూర్(Kashika Kapoor) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కసి కపూర్ పేరుకు తగ్గట్టుగానే కసిగా ఉందంటూ కామెంట్ చేశాడు. హీరోయిన్ పై అభ్యంతరం వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆయన తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించు కోవాలని కోరుతున్నారు.
మల్లారెడ్డి కామెంట్స్ దారుణంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : Hero Vishnu Kannappa :మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ వాయిదా