Manchu Manoj : నిన్నటి దాకా తండ్రీ కొడుకులు ఒకరిపై మరొకరు కొట్టుకునేంత పని చేశారు. ఆస్తుల కోసం రోడ్డుకు ఎక్కారు. నానా రభస సృష్టించారు. చివరకు తాము నటులమనే సంగతి మరిచి పోయారు. వారి గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో డైలాగ్ కింగ్ మేకర్ గా పేరు పొందిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి. ఓ వైపు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా ఇంకో వైపు నటుడిగా తన పని చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల మంచు ఫ్యామిలీ ఆస్తుల విషయంలో తగాదా పడ్డారు.
Manchu Manoj Wishes
కేసుల నమోదు చేసుకునేంత దాకా వెళ్లింది. చివరకు ఈ పంచాయతీ నారా లోకేష్, బాబు వద్దకు చేరింది. అయినా ఎక్కడా మార్పు రాలేదు. వారి వద్ద ఉన్న గన్స్ ను కూడా తీసేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం మంచు విష్ణు కీలక పాత్రలో కన్నప్ప సినిమా వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో డార్లింగ్ ప్రభాస్ , మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్బంగా కన్నప్పలో కీ రోల్ పోషిస్తున్నారు మంచు మోహన్ బాబు. తను పుట్టిన రోజు జరుపుకున్నారు. సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదే సమయంలో తన ఇంట్లోంచి బయటకు వెళ్లిన మంచు మనోజ్ సైతం ఎవరూ ఊహించని రీతిలో ఎక్స్ వేదికగా స్పందించారు. నాన్నా నీ పక్కన లేక పోవడం చాలా వెలితిగా అనిపిస్తోందంటూ పేర్కొన్నాడు. నిన్ను మిస్ కావడం బాధాకరమని పేర్కొన్నాడు. తాజాగా మనోజ్(Manchu Manoj) చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read : Rajamouli SSMB29 Sensational :రూటు మార్చిన ఎస్ఎస్ రాజమౌళి