విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు సమర్పిస్తున్న చిత్రం కన్నప్ప. ఇది భారతీయ ఇతిహాస కథను ఆధారంగా చేసుకుని నిర్మించారు. అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు మంచు విష్ణు. తను ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈసినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. భారతీయ సినిమా రంగంలో టాప్ హీరోస్ ఇందులో నటించడం విశేషం. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మూవీ మేకర్స్ ఆదివారం కన్నప్ప సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు వదిలారు.
మొత్తంగా ట్రైలర్ నిడివి సమయం 2 నిమిషాల 50 సెకండ్లు ఉంది. గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో ముఖ్యమైన పాత్రలలో నటించారు సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ కింగ్ అక్షయ్ కుమార్, అందాల నటి కాజల్ అగర్వాల్ , పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్, రఘు బాబు, బ్రహ్మానందం..తదితరులు నటించారు. భారీ ఎత్తున ఖర్చు చేశారు. మొదటగా పోస్టర్ ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవి శంకర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రశంసలు కురిపించారు. మొత్తంగా కన్నప్పను పాన్ ఇండియా లెవల్లో తీశారు.
కాగా కన్నప్ప భక్తిరస చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. ఇది తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, ఆంగ్ల భాషలలో రిలీజ్ కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు దీనిని.