తమిళ సినీ రంగంలో ఇద్దరు దిగ్గజాలు కలిసి సినిమా చేయబోతున్నారా అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా తీశాడు దర్శకుడు మణిరత్నం. తాను భిన్నమైన కథలను ఎంచుకునే పనిలో ఉన్నానని పేర్కొన్నాడు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఇద్దరం కలిసి పని చేసే ఆస్కారం ఉందన్నాడు. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో రొమాంటిక్ కథతో కొత్తగా సినిమా తీస్తున్నట్లు సమాచారం.
దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం తను కమల్ హాసన్ తో కలిసి 38 ఏళ్ల తర్వాత థగ్ లైఫ్ తీశాడు. జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. నాయకుడులో రజనీకాంత్ తో పాటు కమల్ హాసన్ కూడా నటించారు. ఈ సినిమా 1987లో రిలీజ్ అయ్యింది. భారత దేశంలో సంచలనం సృష్టించింది. ముంబై వేదికగా నడుస్తున్న మాఫియాను తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.
1991లో చిత్రం తలాపతిలో ఇద్దరూ కలిసి పని చేశారు . రెండేళ్ల కిందట పొన్నియన్ సెల్వన్ ఆడియో లాంచ్ సమయంలో మణిరత్నం, రజనీకాంత్ కలిసి పాల్గొన్నారు. తాజాగా ఓ మీడియాతో చిట్ చాట్ చేశారు దర్శకుడు. తలైవాతో మూవీ తీయాలంటే కథ బలంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారు. మొత్తంగా థగ్ లైఫ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ , సాంగ్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది.