భారతీయ సినీ రంగంలో మోస్ట్ ఫెవరబుల్ దర్శకుడిగా పేరు పొందాడు మణిరత్నం. తను దర్శకత్వం వహించిన ప్రతి మూవీ ఓ క్లాసిక్. గత ఏడాది ఐశ్వర్య రాయ్, త్రిష కృష్ణన్ , చియాన్ విక్రమ్ కలిసి నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్ సూపర్ సక్సెస్ అయ్యింది. దీనికి సీక్వెల్ తీశాడు. ఇది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళ నాడులో జరిగిన చారిత్రిక నేపథ్యంగా వచ్చిన నవల ఆధారంగా తెరకెక్కించాడు మణిరత్నం.
ఈ ఏడాది మరో సినిమాతో ముందుకు వచ్చాడు. అదే థగ్ లైఫ్. ఇందులో ఇలయ నాయగన్ కమల్ హాసన్, సిలాంబరసన్, త్రిష కృష్ణన్ కీ రోల్స్ పోషించారు. ఇది దొంగల నేపథ్యంగా సాగే కథ. దీనిని అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న చిత్రం ఇది. 38 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. గత 38 ఏళ్ల కింద కమల్ తో తీసిన నాయకుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు థగ్ లైఫ్ అంతకంటే భిన్నంగా అద్భుతంగా ఉండ బోతోందంటూ ప్రకటించాడు మణిరత్నం సర్.
కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. తను ఆస్కార్ అవార్డు గ్రహీత కావడం విశేషం. ఇదే సమయంలో థగ్ లైఫ్ లో త్రిష కృష్ణన్, కమల్ హాసన్ ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. కమల్ హాసన్ అంటేనే ముద్దులకు, హగ్ లకు కొదవే ఉండదని టాక్. దీనిపై స్పందించాడు మణిరత్నం. కథకు అనుగుణంగా సీన్స్ ను చిత్రీకరించామని, వాటిని సెక్స్ కోణంలో చూడొద్దంటూ కోరాడు దర్శకుడు.