మణిర్నతం దర్శకత్వంలో ఇలయ నాయగన్ కమల్ హాసన్, సిలాంబరసన్ తో పాటు ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్ కలిసి నటించిన చిత్రం థగ్ లైఫ్ . ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన దానికంటే మిశ్రమ స్పందన లభించింది. భారీ ఎత్తున ప్రచారం చేపట్టారు. విడుదలైన నాటి నుంచి నేటి వరకు అంటే వారం రోజుల్లో థగ్ లైఫ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా రూ. 42 కోట్లు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీ రోల్ పోషించిన హౌస్ ఫుల్ 5 మూవీ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంతో థగ్ లైఫ్ పోటీ పడింది. ఆ సినిమా కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది.
ఈనెల 11న కేవలం రూ. 1.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మొత్తం కలెక్షన్స్ రూ. 40 కోట్లకు పైగానే వసూలు కావడం విస్తు పోయేలా చేసింది. 15.57 శాతం ఆక్యుపెన్సీ వచ్చినట్లు తెలిసింది. థగ్ లైఫ్ ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ పూర్తిగా మద్దతు ఇచ్చాయి. కమల్, శింబు, త్రిషతో పాటు అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ , నాసర్, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్ థగ్ లైఫ్ లో కీలక పాత్రలు పోషించారు.
కమల్ హాసన్ 38 సంవత్సరాల తర్వాత థగ్ లైఫ్ కోసం మణి రత్నంతో కలిసి పనిచేశారు. వారు కలిసి నటించిన చివరి చిత్రం 1987లో వచ్చింది నాయకుడు. తమిళంలో నాయకన్. సుదీర్ఘ కాలం తర్వాత ఇద్దరూ కలిసి పని చేశారు ఈ చిత్రం కోసం. ఈ మూవీకి కథ రాశాడు స్వయంగా కమల్ హాసన్. ఇందులో ఓ పాట కూడా రాయడం విశేషం. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.