నవ్వుకు కేరాఫ్ గా మారిన నటుడు సంపూర్ణేశ్ బాబు. ఎలాంటి భేషజాలు లేకుండా తన పని తాను చేసుకుంటూ పోవడమే తన నైజం. ఆయన నటించిన హృదయ కాలేయం ఆ మధ్యన ప్రధాన హీరోల సినిమాలను తట్టుకుని నిలబడింది. తన నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తీసిన కొబ్బరిమట్టం ఆశించిన మేర ఆడలేదు. అయినా నటించడం మాత్రం మాను కోవడం లేదు సంపూర్ణేశ్ బాబు.
మనోడు కారులో కంటే బస్సులోనే ప్రయాణం చేస్తాడు. ఇలాగైతేనే తనలోని సహజ నటుడు ఎక్కడికీ పోడంటూ పేర్కొంటాడు. తాజాగా పొలిటికల్ సెటైరికల్ సినిమా చేశాడు . అదే మార్టిన్ లూథర్ కింగ్. ఇదేదే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మానవ హక్కుల కార్యకర్త అనుకుంటే పొరపాటు పడినట్టే.
ఇది ఇప్పటికే తమిళంలో సినిమాగా వచ్చింది. కానీ దీనిని తెలుగులో భిన్నంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు అపర్ణ కొల్లూరు. తన కెరీర్ లో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. మూవీకి సంబంధించిన పోస్టర్స్ , ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
కొన్ని సినిమాలు దసరా కానుకగా రానున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది తమ తమ ప్రాంతాలకు వెళతారు. ప్రత్యేకించి ఇరు తెలుగు రాష్ట్రాలు సెలవులు కూడా ప్రకటించాయి. ఈ మేరకు అక్టోబర్ 27న మార్టిన్ లూథర్ కింగ్ ను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక సంపూర్ణేశ్ బాబు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
