Ravi Teja : టాలీవుడ్ లో పవర్ ఫుల్ పాత్రలకు పెట్టింది పేరు హీరో రవితేజ. అందుకే తనను అందరూ మాస్ మహారాజా అని పిలుచుకుంటారు. తాజాగా మాస్ మహారాజా(Ravi Teja) పేరుతో మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది వచ్చే మే నెలలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ కొత్త మూవీలో రవితేజతో పాటు మరోసారి శ్రీలీల నటిస్తుండడం విశేషం. ఇద్దరూ కలిసి గతంలో నటించారు మజాకా డైరెక్టర్ దర్శకత్వంలో. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Ravi Teja Movie Updates
ప్రస్తుతం మాస్ జాతర(Mass Jathara) చిత్రానికి బాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో తాజా అప్ డేట్ వచ్చింది రవితేజ గురించి. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పాడని. దీనిని ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ నిర్మించనుంది. ఈ విషయాన్ని ఇటీవలే చిట్ చాట్ సందర్బంగా నిర్మాత నాగ వంశీ వెల్లడించారు.
ఈ కొత్త మూవీ పూర్తిగా సోషియో ఫాంటజీ జానర్ లో ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏది ఏమైనా రవితేజ ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ . తను దర్శకులకు నచ్చిన హీరో. ఏ పాత్ర ఇచ్చినా సరే దానికి వంద శాతం న్యాయం చేస్తాడు. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్ర అయితే ఇరగదీయడం ఖాయం. ఇది తనకున్న ప్రత్యేకత. మొత్తంగా మాస్ జాతర మే నెలలో రిలీజ్ అవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక మాస్ జాతరకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ మాత్రం సూపర్ అన్న టాక్ ఉంది. మరింత అంచనాలు పెంచేలా చేసింది ఈ చిత్రం.
Also Read : Hero Nithin-Robinhood :నితిన్ శ్రీలీల రాబిన్ హుడ్ హిట్టా ఫట్టా..?