Jagga Reddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రధాన పాత్రలో సినిమా రాబోతోంది. పండుగ పర్వదినం పురస్కరించుకుని హైదరాబాద్ లో సినిమా ఆఫీస్ ప్రారంభమైంది. కూతురు జయలక్ష్మి రెడ్డి, భార్య తో పాటు దర్శకుడు రామానుజం పాల్గొన్నారు. జగ్గారెడ్డి(Jagga Reddy) అత్యంత పవర్ లీడర్ గా ఎదిగాడు. తొలుత విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగాడు. ఆయన సాగించిన రాజకీయ ప్రయాణం యువతకు ఆదర్శ ప్రాయంగా ఉంటుందనే ఉద్దేశంతోనే చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు.
Jagga Reddy-Mass Leader Movie Updates
సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గా రెడ్డి. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తుండడం విశేషం. ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడప్ అందుకున్నాయి. ఈ సందర్బంగా మూవీ మేకర్స్ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. అత్యంత శక్తివంతమైన నాయకుడిగా తను కనిపించ బోతున్నారు. ఈ విషయాన్ని వెల్లడించారు దర్శకుడు రామానుజం. ఈ మూవీకి క్యాప్షన్ కూడా పెట్టారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ పేరుతో పోస్టర్ కూడా పెట్టారు.
ఈ సందర్బంగా జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ చెప్పిన కథ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఇందులో నా పాత్ర నాదే. ఎవరో రాసిన మాటలను తాను మాట్లాడటం లేదు. అంతా ఒరిజనల్ . ఎవరికీ కాపీ అనేది ఉండదన్నారు జగ్గారెడ్డి. కుట్రలు, కుతంత్రాలు, హత్యా ప్రయత్నాలు నాపై జరిగాయి. వీటన్నింటిని తట్టుకుని ఈ స్థాయికి వచ్చానని అన్నారు.
Also Read : Hero Pawan Kalyan-OG :పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ లో రిలీజ్
