చైతూ స‌ర‌స‌న మీనాక్షి చౌద‌రి

ఎన్సీ 24 కొత్త మూవీలో కీ రోల్

అక్కినేని నాగ చైత‌న్యకు ఈ ఏడాది శుభారంభం ద‌క్కింది. త‌ను సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించిన చిత్రం తండేల్. అద్భుతంగా ఆడింది. దీంతో గ‌త కొంత కాలంగా హిట్ లేక పోవ‌డంతో కొంత నిరాశ‌కు గుర‌య్యాడు. ఈ స‌మ‌యంలో తండేల్ ఇచ్చిన కిక్ తో దూసుకు పోతున్నాడు. ఎన్సీ24 అనే చిత్రంలో న‌టిస్తున్నాడు.

విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. రిలీజ్ కాకుండానే రికార్డ్ బ్రేక్ చేస్తోంది. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండేలా చేసింది. త‌ను నేష‌నల్ హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భుతో పెళ్లి పెటాకులైంది. ఇద్ద‌రూ విడిపోయారు. ఆ త‌ర్వాత మ‌రో న‌టి శోభిత ధూళిపాళ‌ను పెళ్లి చేసుకున్నాడు. త‌ను వ‌చ్చాక సంతోషం త‌న‌లో క‌నిపిస్తోంది.

తండేల్ కు మంచి స్పంద‌న రావ‌డంతో వ‌రుస‌గా సినిమాల‌లో న‌టించాలంటూ నాగ చైత‌న్య‌కు ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ఎన్సీ 24 కొత్త ప్రాజెక్టులో చైత‌న్య స‌ర‌స‌న త‌మిళ అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

త‌ను ఫుల్ ఖుష్ లో ఉంది. దీనికి కార‌ణం ఏమిటంటే అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రంలో న‌టించింది. త‌న‌తో పాటు ఐశ్వ‌ర్య రాజేశ్, విక్ట‌రీ వెంక‌టేశ్ , బుల్లిరాజు న‌టించారు. ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత త‌న‌కు కూడా సూప‌ర్ ఛాన్స్ లు వ‌స్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com