టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా తగ్గడం లేదు. తను యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. తనకు ఏజ్ తో సంబంధం లేదంటూ డ్యాన్సులతో, నటనతో హోరెత్తిస్తున్నారు. కొన్నేళ్లుగా ఎక్కడా ఆగకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇంకో వైపు ఈవెంట్స్ కూడా అటెండ్ అవుతూ ఇతర నటీనటులను, దర్శకులు, నిర్మాతలను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తూ సినీ ఇండస్ట్రీకి పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు.
తను మరో దమ్మున్న డైరెక్టర్ కు ఓకే చెప్పాడు. తను ఎవరో కాదు మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ స్టార్ట్ అవుతోందంటూ ప్రకటించాడు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గతంలో చిరు, నయనతార కలిసి సైరా, గాడ్ ఫాదర్ లలో నటించారు. ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.
మరో వైపు మెగాస్టార్ నుండి కీలక అప్ డేట్ వచ్చింది. తాను నటిస్తున్న మరో కీలక చిత్రం విశ్వంభర. ఇది పూర్తిగా సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఇందులో అందాల తార త్రిష కృష్ణన్, కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ దీనిని నిర్మిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కీలక దశలో ఉందని, త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్.
