దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వం వహించిన చిత్రం మెట్రో ఇన్ దినో. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. జూలై 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఇందులో కీ రోల్స్ పోషించారు ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీఖాన్. డేట్ ఫిక్స్ చేయంతో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. సామాజిక మాధ్యమం ద్వారా మెట్రో ఇన్ దినో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో నాలుగు జంటల మధ్య నెలకొన్న బంధాలను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అనురాగ్ బసు. తన టేకింగ్ డిఫరెంట్ గా ఉంది. మేకింగ్ లో సూపర్ అని చెప్పక తప్పదు. కామెడీ, హార్రర్ , రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో చాలానే ఉన్నాయి. ఈ సందర్బంగా దర్శకుడు సూపర్ క్యాప్షన్ కూడా జోడించాడు. ఆధునిక ప్రేమ చాలా గందర గోళంగా ఉంటుంది. ఇది చైనీస్ మసాలా దోశ లాంటిదంటూ పేర్కొన్నాడు. తను చేసిన ఈ వ్యాఖ్యలు మరింత సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది.
మెట్రో ఇన్ దినో చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీఖాన్ తో పాటు అనుపమ్ ఖేర్, అలీ ఫజల్, నీనా గుప్తా, ఫాతిమా సనా షేక్ , తదితరులు నటించారు. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సీరీస్ నిర్మించింది. ఈ సందర్బంగా సారా అలీ ఖాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ జంట ఎవరో చెప్పాలని కోరగా ఇంకెవరో మీకు తెలియదా అంటూ పేర్కొంది. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ అంటూ తెలిపింది.
