అమరావతి – ఆనాటి నవాబుల కాలం నుంచి కొన్ని శతాబ్దాలుగా వెలుగొంది నటువంటి గడ్డ ఈ బందరు గడ్డ, ఇక్కడ పుట్టడం మనందరి అదృష్టం అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం మసులా బీచ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. కూటమి సర్కార్ టూరిజం రంగాన్ని ప్రమోట్ చేస్తున్నారన్నారు. అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఉద్యోగవకాశాలు ఈ రంగంలో సృష్టించ వచ్చాన్నారు.
అధిక జీడీపీ ని కూడా పెంచుకునే రంగం టూరిజం అని అన్నారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇదే రంగమన్నారు. ఇవాళ ప్రపంచంలో కొన్ని దేశాలు టూరిజం మీద బ్రతుకుతున్నాయని అన్నారు. అయితే మనం మాత్రం పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చామన్నారు. ఫెస్ట్ 2025ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ సినిమాకి డైరెక్ట్ చేసి మన ముందుకు వచ్చినటువంటి జ్యోతి కృష్ణకు , హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేస్తున్నామన్నారు. అదేవిధంగా జబర్థస్త్ టీమ్ బుల్లెట్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వడం అభినందించదగ్గ విషయమన్నారు. తాను 2014 లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ బీచ్ అభివృద్ధికి 10 కోట్లతో చేశామన్నారు. కానీ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో మళ్లీ ఈ బీచ్ ను మూసేశారన్నారు.. ఆ రోజున వచ్చినట్టు నాకు అవకాశం ఈ రోజు కూడా వచ్చిందన్నారు.
సీఎం , డిప్యూటీ సీఎంల సహకారంతో రాజధాని అమరావతిలో నిర్మించే ఐకానిక్ టవర్ ఫ్లాగ్ ను మనం మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. నేషనల్ కాలేజీలో గాంధీకి మొదటిసారి ఇండియన్ ఫ్లాగ్ ను అందించిన వ్యక్తి పింగళి వెంకయ్య చౌదరి మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం మనం గర్వించదగ్గ విషయమన్నారు. అలాంటి గడ్డ బందరు గడ్డ అని కొనియాడారు.
