అభివృద్దిలో ప‌రుగులు తీస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్

స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్

అమరావతి – దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్య‌మైంద‌న్నారు.
ఎక్క‌డా లేని విధంగా అన్నక్యాంటీన్లు నడిపిస్తున్నామ‌ని చెప్పారు. దీపం పథకం కింద ఆడపడుచులకు లోన్లు ఇస్తున్నామ‌న్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామ‌ని పేర్కొన్నారు నారా లోకేష్‌. గురువారం త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం ప్రారంభించామ‌న్నారు. మొత్తం 17 ల‌క్ష‌ల మందికి పైగా త‌ల్లుల‌కు రూ. 1847 కోట్లు వారి ఖాతాల్లో జ‌మ చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.

ప్రతి తల్లి ఖాతాలో న‌గ‌దును జ‌మ చేయ‌డంతో తాము ఇచ్చిన మాట ప్ర‌కారం నిల‌బెట్టుకున్న‌ట్లు చెప్పారు నారా లోకేష్. కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులు అన్నారు. ఏడాదిలో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం ప్రారంభించామ‌న్నారు. మోడీ, చంద్ర‌బాబు నాయక‌త్వంలో అటు దేశం, ఇటు రాష్ట్రం ప‌రుగులు తీస్తున్నాయి అభివృద్థి ప‌థంలో అని పేర్కొన్నారు. గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు. ఇది త‌మ స‌ర్కార్ కు ద‌క్కిన క్రెడిట్ అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నామ‌ని చెప్పారు నారా లోకేష్. బాబు సూపర్ సిక్స్ లో ‘తల్లికి వందనం’ హామీ నిలబెట్టుకున్నాం అన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ‘తల్లికి వందనం’ అమ‌లు చేసి తీరామ‌న్నారు. ప్రజల ఆశలు నెరవేర్చే బాధ్యత త‌మ‌పై ఉంద‌న్నారు మంత్రి.
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com