థాయిలాండ్ – మిస్ వరల్డ్ 2025 విజేత థాయిలాండ్ కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరిగిన పోటీలకు పెద్ద ఎత్తున ఆతిథ్యాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం రాజధాని హైదరాబాద్ లో. మొత్తం 108 దేశాల నుంచి అందగత్తెలు హాజరు అయ్యారు. వీరిలో కేవలం ఫైనల్ కోసం 8 మందిని ఎంపిక చేశారు న్యాయనిర్ణేతలు. చివరకు విశ్వ సుందరిగా థాయిలాండ్ సుందరి ఎన్నికైంది. తనకు భారీ ఎత్తున నగదు బహుమతిని అందించింది.
ఇది పక్కన పెడితే తను గురువారం మీడియాతో మాట్లాడింది ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ. తెలంగాణ మహిళా పోలీసులు చేసిన సేవలు, అందించిన భద్రతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారి పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొంది. వారిపై ప్రశంసల జల్లులు కురిపించింది. ఇదే సమయంలో థాయ్‌లాండ్‌లో మహిళా పోలీసులు కనిపించరని.. తెలంగాణలో వారిని ఎక్కువ శాతం చూడడం సంతోషంగా అనిపించిందని వెల్లడించింది ఈ విశ్వ సుందరి.
మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చినప్పుడు మహిళా పోలీసులు తనను కంటికి రెప్పలా కాపాడారని ప్రశంసలు కురిపించింది. ఇది మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంపొందిస్తుందని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసంది ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ.
అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ అందాల పోటీల నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రధానంగా ఇందులో పాల్గొన్న మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తీవ్ర ఆరోపణలు చేసింది. పోటీలలో పాల్గొన్న తమను వేశ్యలు లాగా చూశారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై సర్కార్ విచారణకు ఆదేశించింది. చివరకు విచారణ అధికారిగా ఉన్న శిఖా గోయల్ పై బదిలీ వేటు వేసింది.