మలయాళ సినీ రంగంలో అత్యంత పాపులర్ నటుడు మోహన్ లాల్. సహజ సిద్దమైన నటనకు తను పెట్టింది పేరు. తాజాగా తెలుగులో మంచు మోహన్ బాబు సమర్పిస్తున్న కన్నప్ప ఇతిహాసం నేపథ్యంలో వస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఒకే ఏడాదిలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి తను నటించిన ఎంపురాన్..తుడరుమ్ మూవీస్. బాక్సాఫీస్ వద్ద అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రికార్డులు తిరగ రాస్తున్నాయి కలెక్షన్స్ పరంగా.
ఈ ఏడాది 2025లో తనకు బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఇది తను కూడా అనుకోలేదు. కానీ నటించడం పైనే తాను ఎక్కువగా ఫోకస్ పెడతానని, సక్సెస్, ఫెయిల్యూర్ గురించి పట్టించుకోనంటూ ఇప్పటికే పలుమార్లు చెబుతూ వచ్చారు మోహన్ లాల్. ఎల్ 2 ఎంపురాన్ గతంలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా మోహన్ లాల్ కెరీర్ లో నిలిచి పోయింది.
విచిత్రం ఏమిటంటే మోహన్ లాల్ వయసు 65 ఏళ్లు. ఇప్పటికీ ఆయన కీలకమైన పాత్రలలో అద్భుతంగా నటిస్తూ అందరినీ ఆశ్చర్య పోయేలా చేస్తున్నాడు. ఎంపురాన్ తో పాటు తుడరుమ్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవర్సీస్ తో కలిపి ఎంపురాన్ మూవీ రూ. 268.05 కోట్లు కలెక్షన్స్ చేసింది. మరో వైపు తుడరుమ్ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 237.60 కోట్లు సాధించింది. సినీ విమర్శకులు సైతం విస్తు పోయేలా సక్సెస్ టాక్ తెచ్చుకున్నాయి.