Tudarum : మలయాళ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు మోహన్ లాల్. తనకు ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం కంటే న్యాయం చేస్తాడు. తన స్టైలే వేరు. ఇదే సమయంలో మరో అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఎల్ 2 ఎంపురాన్. ఇది పార్ట్ 2గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగం లూసిఫర్. ఇది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక రెండో భాగం కూడా విడుదలై అందరి అంచనాలు తలకిందులు చేస్తూ దూసుకు పోతోంది వసూళ్ల పరంగా.
Mohan Lal Tudarum Movie Collections
తాజాగా మరో కీలక అప్ డేట్ వచ్చింది మోహన్ లాల్ కు సంబంధించి. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత నటి శోభనతో కలిసి మోహన్ లాల్ నటించిన చిత్రం తుడరుమ్(Tudarum). విడుదలైన రోజు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అద్భుతమైన కలెక్షన్లను సాధించి ఔరా అనిపించేలా చేసింది. ప్రత్యేకించి మోహన్ లాల్ నటన, దర్శకుడి ప్రతిభ, ఇతర నటీనటుల సహజత్వంతో కూడిన నటన ప్రతి ఒక్కరినీ కట్టి పడేసేలా చేసింది. మొత్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.
గత నెల ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది తుడరుమ్. దీనిని మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. ఇతర భాషల్లో అంతగా ఆదరణ లభించక పోయినా మలయాళంలో మాత్రం దుమ్ము రేపుతోంది. కోట్ల రూపాయలు వసూలు చేసే పనిలో పడింది. ఇప్పటికే రూ. 75 కోట్లను వసూలు చేసింది ఒక్క కేరళలోనే. ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు వసూలు చేయడం విశేషం. జేక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా దోహద పడింది.
Also Read : Natural Star Nani-Sujeeth : సుజిత్ తో నేచురల్ స్టార్ నాని మూవీ