Hero Allu Arjun-Mrunal :ఐకాన్ స్టార్ తో జ‌త క‌ట్ట‌నున్న మృణాల్ ఠాకూర్

స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ మూవీలో కీ రోల్

Hero Allu Arjun-Mrunal

Allu Arjun : ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ కాంబోలో రూ. 800 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోంది న్యూ మూవీ. దీనిని ప్ర‌ముఖ చ‌ల‌న చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ చీఫ్ ఎంపీ ద‌యానిధి మార‌న్ నిర్మిస్తున్నాడు. బన్నీ పుట్టిన రోజు సంద‌ర్బంగా పోస్ట‌ర్ , వీడియోను రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. ఇంకా షూటింగ్ మొద‌లు పెట్ట‌కుండానే వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ మార్కెట్ నెల‌కొన‌డం సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఈ త‌రుణంలో రోజుకో వార్త గుప్పుమంటోంది. సినీ ప్రేక్ష‌కుల‌ను విస్తు పోయేలా చేస్తోంది.

Allu Arjun-Mrunal Thakur Movie Updates

ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్ల‌ను ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్ సంప్ర‌దించాడ‌ని, ఇందులో భాగంగా డిఫ‌రెంట్ రోల్స్ తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న న‌టి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ను ఓ పాత్ర కోసం ఎంపిక చేసిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది కోలీవుడ్ లో, టాలీవుడ్ లో. ప్ర‌స్తుతం ఏఏ22ఎక్స్ఏ6 పేరుతో తాత్కాలికంగా టైటిల్ ను ఖ‌రారు చేశాడు ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే అల్లు అర్జున్, అట్లీ క‌లిసి అమెరికాకు వెళ్లి వ‌చ్చారు. అక్క‌డ టాప్ స్టూడియోను సంద‌ర్శించారు.

మ‌రో వైపు మృణాల్ ఠాకూర్ గ‌తంలో సీతారామం, హాయ్ నాన్న చిత్రాల‌లో న‌టించింది. భిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషించింది. త‌న న‌ట‌న‌కు మంచి మార్కులు కొట్టేసింది. అద్భుతంగా న‌టించినందుకు గాను ప‌లు అవార్డులు కూడా ద‌క్కాయి న‌టికి. ఈ మేర‌కు అట్లీ త‌న‌ను ఎంపిక చేసే ఛాన్స్ లేక పోలేద‌ని సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొన్ని వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ ను కూడా ఇంకో రోల్ లో న‌టించ‌నుంద‌ని టాక్. అయితే సినిమా తారాగ‌ణంకు సంబంధించి ఇంకా ప్ర‌క‌టించ‌లేదు ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్.

Also Read : Srinidhi Shetty Shocking : య‌శ్ తో అందుకే వ‌ద్ద‌నుకున్నా – శ్రీ‌నిధి శెట్టి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com