ప్రముఖ నటి తమన్నా భాటియాపై కన్నడవాసులు మండి పడుతున్నారు. తనను మైసూర్ శాండిల్ సబ్బు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఫైర్ అవుతున్నారు. ఈ వివాదం ప్రాంతీయ గుర్తింపు, ప్రాతినిధ్యంపై చర్చకు దారితీసేలా చేసింది. మైసూర్ శాండిల్ సబ్బు 1916లో తయారు చేశారు. దాదాపు 110 ఏళ్ల తర్వాత సబ్బుల ప్రమోషన్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించాలనే దానిపై కర్ణాటకలో రాజకీయ , సాంస్కృతిక వివాదానికి దారితీసేలా చేసింది.
ప్రస్తుతం కన్నడ నాట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ యాజమాన్యంలోనే మైసూర్ శాండిల్ సోప్స్ తయారవుతున్నాయి. దీనికి కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్డీఎల్) తయారు చేస్తోంది. దీనికి తాజాగా తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడిగార్ గా నియమించారు. ఇదిలా ఉండగా తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు గాను తమన్నాకు సర్కార్ ఏకంగా రూ. 6.2 కోట్లకు ఒప్పందం చేసుకుందని సమాచారం.
దీనిపై కన్నడ అనుకూల సంఘాలు, ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున తీవ్ర అభ్యంతరం తెలిపారు. విమర్శలు ఎదుర్కొంది కర్ణాటక సర్కార్. బీజేపీ దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. నిలదీసింది సర్కార్ ను. ఇదిలా ఉండగా తన నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు సిద్దరామయ్యకు అధికారికంగా లేఖ రాశారు. కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర చీఫ్ నారాయణ గౌడ్ బహిరంగంగా ప్రశ్నించారు.