టాలీవుడ్ లో సూపర్ మూవీస్ ను నిర్మిస్తూ తమకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీసే పనిలో పడ్డారు. వారి కన్ను ఇప్పుడు బాలీవుడ్ పై పడింది. దమ్మున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నేరుగా హిందీలో మూవీ తీశారు. ఇందులో సన్నీ డియోల్ తో తీసిన ఈ చిత్రం కాసులు కొల్లగొట్టింది. తనకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. ఇదే సమయంలో సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తీసిన పుష్ప-2 సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఏకంగా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 2వ చిత్రంగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఇందులో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు తోడు శ్రీలీల స్పెషల్ సాంగ్ కెవ్వు కేక అనిపించేలా చేసింది. ఏకంగా రూ. 1867 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ ను విస్తు పోయేలా చేసింది. దీంతో బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలంతా ఇప్పుడు సౌత్ ఇండియా డైరెక్టర్స్ సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
ఇప్పటికే సల్మాన్ ఖాన్ ఏఆర్ మురుగదాస్ తో సికిందర్ తీశాడు. ఇక అమీర్ ఖాన్ తమిళ సినీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఒప్పందం చేసుకున్నాడు. తను సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక బాద్ షా షారుక్ ఖాన్ ఇప్పటికే జవాన్ తీశాడు. దీనిని తమిళ సినీ సూపర్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇది రూ. 1000 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు సుకుమార్ తో మైత్రీ మూవీ మేకర్స్ బాద్ షా తో మూవీ చేస్తున్నట్లు జోరుగా టాక్ నడుస్తోంది. మొత్తంగా సుక్కు డైరెక్టర్, ఖాన్ యాక్షన్ కు బాక్సులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
