Nag Ashwin: ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహానికి సతీ సమేతంగా హజరైన దర్శక ధీరుడు రాజమౌళి… ఆ ఫంక్షన్ లో ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి ఉత్తరాలకే అనే పాటకు తన భార్య రమతో కలిసి ఆయన డ్యాన్స్ వేసారు. దీనితో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది చూసిన వారంతా రాజమౌళిలో డ్యాన్స్ కళ కూడా ఉండటంతోనే ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిందంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి బాటలో మరో దర్శకుడు నాగ్ అశ్విన్ చేరారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన పార్టీలో నాగ్ అశ్విన్ తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Nag Ashwin Dance Viral
‘కల్కి 2898 ఏడీ’తో సినీ ప్రియులకు విభిన్నమైన సినిమాటిక్ అనుభూతిని పంచేందుకు సిద్ధమైన దర్శకుడు నాగ్ అశ్విన్… మంగళవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ కు ఆయన స్పెషల్ పార్టీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో ఆయన టీమ్‌తో కలిసి ‘మాస్’ టైటిల్ సాంగ్‌కు స్టెప్పులేశారు. అనంతరం తన సతీమణి ప్రియాంకతో కలిసి ‘‘వయ్యారి భామ… నీ హంస నడక’’ పాటకు డ్యాన్స్ చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ లో కూడా మంచి డ్యాన్స్ టాలెంట్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD’. ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు.
Also Read : Dasari Sahithi: ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి !