ట్రెండ్ మారింది. టాలీవుడ్ తో పాటు ఇతర సినీ రంగాలలో కొత్తగా రీ రిలీజ్ వ్యవహారం కొనసాగుతోంది. గతంలో రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి జనాదరణ పొంది, కాసుల వర్షం కురిపించిన సినిమాలు తిరిగి వస్తున్నాయి. ప్రధానంగా టాప్ హీరోలకు చెందినవి కావడం విశేషం. ఇదే కొనసాగింపుగా ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే కింగ్ అక్కినేని నాగార్జున నటించిన చిత్రం రగడ. ఇది 2010లో విడుదలైంది. మిశ్రమ స్పందన లభించింది ఈ చిత్రానికి .
తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ఖలేజా విడుదలైంది. మూవీ మేకర్స్ ఆశించిన దానికంటే ఎక్కువ ఇప్పుడు రీ రిలీజ్ తర్వాత రావడం విస్తు పోయేలా చేసింది. దీంతో దూకుడు కూడా రానుందని టాక్. ఇక బుల్లి తెరపై రికార్డుల మోత మోగించింది ప్రిన్స్ మూవీ అతడు. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. మా టీవీలో ఇప్పటికీ అత్యధిక వ్యూయర్సిప్ కలిగి ఉంది. ఎప్పుడు వచ్చినా దీనిని చూసేందుకు తెగ ఇష్ట పడతారు తెలుగు వారు.
ఇక అక్కినేని నాగార్జునకు సంబంధించిన మూవీస్ లలో ఒక్కో దానిని ప్రేక్షకుల ముందుకు తిరిగి తీసుకు రావాలని నిర్ణయించారట. ఇందులో భాగంగా నాగ్ పుట్టిన రోజు అంటే ఆగస్టు 29 అన్నమాట. ఆరోజునే తను నటించిన రగడను రీ రిలీజ్ చేయనున్నారు. ఇందులో లవ్లీ బ్యూటీస్ అనుష్క శెట్టి, ప్రియమణి ఇతర పాత్రలు పోషించారు. మంచి ఎంటర్ టైన్, కామెడీ చిత్రంగా దీనిని పేర్కొనవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే చూసేందుకు రెడీ కండి.
