Namo: సర్వైవల్ కామెడీ జానర్ లో పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘నమో’Namo’. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా… విస్మయ శ్రీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఏ ప్రశాంత్ నిర్మించారు. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీని జూన్ 7న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ… మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు.
Namo..
విశ్వంత్, అనురూప్ కాంబోలో హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రానున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రొమోషనల్ కంటెంట్ మంచి స్పందనను వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు విడుదల తేదీని రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్‌లో హీరోలిద్దరూ వింత ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి కనిపిస్తుండగా… బ్యాగ్రౌండ్‌లో హీరోయిన్ నవ్వుతూ ఉంది. పోస్టర్ డిజైన్ ఇన్నోవేటివ్‌గా ఉంది. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు క్రాంతి ఆచార్య వడ్లూరి మ్యూజిక్ డైరెక్టర్2గా, సనల్ అనిరుధన్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : Sai Rajesh: బేబీ దర్శకుడు సాయి రాజేశ్ మోసంపై బేబీ లీక్స్ పుస్తకం !