రాజకీయ నాయకుడు, నటుడు నందమూరి బాలకృష్ణ అలియాస్ బాలయ్య పుట్టిన రోజు ఇవాళ. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవలే మోదీ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం అందజేసింది. జూన్ 10, 1960లో పుట్టాడు. తన వయసు ఇప్పుడు 64 ఏళ్లు. ఇప్పటికీ యంగ్ హీరోస్ తో పోటీ పడి నటిస్తున్నారు. నటనా పరంగా తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. భార్య వసుంధర. ఇద్దరు కూతుళ్లు. బ్రాహ్మణి, తేజస్విని. తన అల్లుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి తనయుడు , మంత్రి నారా లోకేష్.
బాలకృష్ణ వైవిధ్య భరితమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో మెప్పించాడు. పలు సినిమాలు సక్సెస్ అయ్యాయి. తన కెరీర్ లో మరిచి పోలేని సినిమా నరసింహా రెడ్డి. రాయలసీమ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ రికార్డుల మోత మోగించింది. తాజాగా ఈ ఏడాది ఆయన బాబీ దర్శకత్వంలో నటించిన డాకు మహారాజ్ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం తను బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ లో నటిస్తున్నాడు. తన పుట్టిన రోజు పురస్కరించుకుని టీజర్ రిలీజ్ చేశారు. దీనికి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది.
తను ఇటీవలే రాష్ట్రపతి భవన్ వేదికగా పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ జ్యూరీ అవార్డు ను స్వంతం చేసుకున్నాడు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. తన స్నేహితులలో మహమ్మద్ అజహరుద్దీన్, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారున్నారు. బాలకృష్ణ 14 ఏళ్ల వయసులో తన తండ్రి దర్శకత్వం వహించిన తాతమ్మ కల మూవీలో పరిచయం అయ్యాడు. దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలలో నటించాడు. ఇప్పటి వరకు 100కి పైగా సినిమాలలో నటించాడు. ఇంకా నటిస్తూనే ఉన్నాడు.