నటుడు, నిర్మాత నేచురల్ స్టార్ నాని ఇప్పుడు జోష్ మీద ఉన్నాడు. తను నటించిన తాజా చిత్రం హిట్ 3 సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కాసుల వర్షం కురిపించింది. తను నటనతో పాటు నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా తాను నిర్మించిన కోర్ట్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. భారీ ధరకు ఓటీటీ సంస్థ తీసుకుంది. ఈ తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు. తను కొత్తగా బ్యానర్ ఏర్పాటు చేశాడు. టాలెంట్ కలిగిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తున్నాడు. ప్రోత్సహించడంలో ముందంజలో ఉంటున్నాడు.
తన టీంలోంచి వచ్చిన వచ్చిన ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను టాప్ దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వారికి మరిన్ని ఛాన్స్ లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడు నేచురల్ స్టార్. ఇక పోక్సో చట్టం నేపథ్యంగా వచ్చిన చిత్రం కోర్ట్. దీనిని నాని కేవలం రూ. 12 కోట్లు ఖర్చు పెట్టాడు . ఊహించని సక్సెస్ అయ్యింది. ఇందులో సాయి కుమార్, ప్రియదర్శి పులికొండ నటించారు. ఈ చిత్రం అంచనాలకు మించి రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఈ సినిమా ఇచ్చిన ఊపుతో నాని ఎక్కడా ఆగడం లేదు. మరో వైపు హిట్ 3 బ్లాక్ బస్టర్ కావడంతో తనకు ఈ ఇయర్ మంచి శుభారంభం ఇచ్చిందని చెప్పక తప్పదు. ఇక కోర్ట్ కు దర్శకత్వం వహించాడు రామ్ జగదీశ్. తను టేకింగ్, మేకింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో మరోసారి తనకు బిగ్ ఆఫర్ ఇచ్చాడు నాని. తన బ్యానర్ లోనే మరో సినిమాకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించాడు. ఇందులో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు టాక్.
