Natural Star Nani-Hit 3 :నేచుర‌ల్ స్టార్ నాని హిట్ 3 సూప‌ర్ హిట్

స‌త్తా చాటిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను

Natural Star Nani-Hit 3

Hit 3 : అంచ‌నాలకు త‌గ్గ‌ట్టుగానే నేచుర‌ల్ స్టార్ నాని మ‌రో హిట్ కొట్టాడు. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఏకంగా తొలి రోజే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 30 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు సినీ వ‌ర్గాల అంచ‌నా. ఇది ప్రాథ‌మిక స‌మాచారం మాత్ర‌మే. ఇంకా దీనిపై మూవీ మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌లేదు. అమెరికాలో సినిమా గురించి చూసిన వారంతా బాగుందంటూ పేర్కొంటుండ‌డం విశేషం.

Natural Star Nani-Hit 3 Movie Updates

ప్ర‌పంచ వ్యాప్తంగా మే 1న మేడే కార్మికుల దినోత్స‌వం సంద‌ర్బంగా సెల‌వు కావ‌డంతో పెద్ద ఎత్తున హిట్ 3ని(Hit 3) చూసేందుకు వ‌స్తున్నారు. థియేట‌ర్లు కూడా క‌ళ‌క‌ళ లాడుతున్నాయి. నాని న‌ట‌న‌, కొల‌ను ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ , శ్రీ‌నిధి శెట్టి కీ రోల్ పోషించ‌డంతో సినిమాకు అదన‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ముంద‌స్తు బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున బుకింగ్ కావ‌డంతో ఆశించిన దానికంటే ఎక్కువ‌గా క‌లెక్ష‌న్ల పంట పండుతోంది. విదేశీ మార్కెట్ లో నాని స్టార్ డ‌మ్ కూడా ప‌ని చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్రీ సేల్స్ రికార్డ్ బ్రేక్ చేశాయి. త‌ను గ‌తంలో న‌టించిన అంటే సుంద‌రానికి, హాయ్ నాన్న‌, ద‌స‌రా సినిమాలు కూడా ప్రారంభంలో అద్భుత‌మైన క‌లెక్ష‌న్స్ అందుకున్నాయి. ఇక నేచుర‌ల్ స్టార్ నాని న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గా కూడా మారాడు. త‌ను తీసిన కోర్ట్ సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండ‌గా హిట్ 3 పూర్తిగా హింస ఎక్కువ‌గా ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా నాని కెరీర్ లో మ‌రో మూవీ బిగ్ స‌క్సెస్ కావ‌డం తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

Also Read : Victory Venkatesh : ప‌ని చేసుకుంటూ పోతా స‌క్సెస్ ప‌ట్టించుకోను

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com