Natural Star Nani-Paradise : నాని ప్యార‌డైజ్ మూవీకి భారీ డిమాండ్

రూ. 200 కోట్ల‌పై క‌న్నేసిన నేచుర‌ల్ స్టార్

Paradise : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండానే నేచుర‌ల్ స్టార్ నాని దూసుకు పోతున్నాడు. వ‌రుస మూవీస్ స‌క్సెస్ తో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. ఇక న‌ట‌నా ప‌రంగా వంద శాతం న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న న‌టుడు ఉన్న‌ట్టుండి నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చాడు. త‌ను తీసిన తొలి సినిమా కోర్ట్ బిగ్ స‌క్సెస్ అయ్యింది. నానితో పాటు క‌న్న‌డ బ్యూటీ శ్రీ‌నిధి శెట్టి కీల‌క పాత్ర‌లు పోషించిన చిత్రం హిట్ 3.

Paradise Movie Updates

ఊహించ‌ని రీతిలో బిగ్ స‌క్సెస్ అయ్యింది. బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. వ‌సూళ్ల వేట కొన‌సాగిస్తోంది. కేవ‌లం నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్ల‌బ్ లోకి చేరుకుంది. ఇది సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. తాజాగా మ‌రో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. నాని కీ రోల్ పోషించిన మ‌రో చిత్రం ప్యార‌డైజ్(Paradise). ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. ఇప్ప‌టికే ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డ్ బ్రేక్ చేస్తోంది. భారీ మార్కెట్ క‌లిగి ఉండ‌డంతో నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు.

టాలీవుడ్ స్టార్ నాని పరిశ్రమలో అత్యంత ఆర్థికంగా స్థిరంగా ఉన్న హీరోగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తెలుగు సినిమా అగ్రస్థానానికి తీసుకెళ్లే పరిపూర్ణ వాణిజ్య చిత్రం లేకపోయినా, అతని స్క్రిప్ట్ రైటింగ్ నైపుణ్యాలు నిజంగా అద్భుతమైనవని చెప్ప‌క త‌ప్ప‌దు. గత దశాబ్దంలో మరే హీరో కూడా నాని చేయగలిగినంతగా రాణించ లేక పోయాడు .ఇక హిట్ 3లో హింస పెరిగినా జ‌నం ఆద‌రించ‌డం ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా హిట్ 95 శాతం రిక‌వ‌రీ సాధించింది.

Also Read : Terachapa Teaser Sensational :తెర‌చాప మూవీ టీజ‌ర్ రిలీజ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com