Hit 4 : శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 3 సీక్వెల్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేలం ఐదారు రోజుల్లోనే రూ. 130 కోట్లకు పైగా వసూలు చేయడం విస్తు పోయేలా చేసింది. టాలీవుడ్ ను షేక్ చేసింది. ఇప్పటి వరకు నటుడిగా ఉన్న నాని నేచురల్ స్టార్(Nani) గా గుర్తింపు పొందాడు. తను నిర్మాతగా అవతారం ఎత్తాడు. తాను తీసిన చిత్రం కోర్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ ఎత్తున వసూళ్లు చేసింది. తాను నటించిన హిట్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్ల వరద పారిస్తోంది.
Natural Star Nani-Hit 4 Movie Updates
దీంతో సక్సెస్ మీట్ లో మునిగి పోయాడు నాని బృందం. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశాడు. హిట్ 3కి కొనసాగింపు ఉంటుందని స్పష్టం చేశాడు. ఈ మేరకు హిట్ 4(Hit 4) పూర్తిగా హింసకు తావు లేకుండా పూర్తిగా వినోదం, హాస్యం, ఎంటర్ టైనర్ గా రూపొందిస్తామని ప్రకటించాడు నేచురల్ స్టార్. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ కార్తీ నటించే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. నాని సినీ కెరీర్ లోనే అతి పెద్ద బిగ్ హిట్ గా నిలిచింది.
హిట్ బిగ్ హిట్ కావడంలో కీలక పాత్ర పోషించింది కన్నడ స్టార్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడిగా పేరొందాడు శైలేష్ కొలను. అయితే మీడియా అడిగిన ప్రశ్నకు కీలక సమాధానం ఇచ్చాడు నాని. ఇదే దర్శకుడిని హిట్ 4 కోసం కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు రిప్లై ఇస్తూ అవునని స్పష్టం చేశాడు. దీనిని పూర్తిగా హిలేరియస్ లైన్ గా ఉండబోతోందంటూ ప్రకటించాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదడన్నాబు. బిగ్ హిట్ అయ్యేలా చేస్తామన్నాడు నేచురల్ స్టార్.
Also Read : Shubham Movie Success :శుభం సక్సెస్ సమంత ఖుష్
