తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంప్రదాయాలకు పెద్దపీట వేసే దర్శకులలో ఒకడు సతీశ్ వేగేశ్న. తను గతంలో శతమానం భవతి తీశాడు. ఎన్నారైలు తమంతకు తాముగా వెళ్లి పోతే ఇక్కడ ఉన్న వారు ఎలా ఇబ్బందులు పడతారో కళ్లకు కట్టినట్లు చూపించారు. అంతే కాదు తాను తీసిన మరో మూవీ కూడా మంచి ఆదరణ లభించింది. తాజాగా సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న చిత్రం శ్రీశ్రీ రాజా వారు. ఈ మేరకు కీలక అప్ డేట్ ఇచ్చారు. జూన్ 6వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందులో ముఖ్య పాత్ర పోషించారు నార్నే నితిన్. తను ఎవరో కాదు ప్రముఖ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు స్వయాన బావ మరిది. అంతే తన భార్య తమ్ముడు. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ విడుదలైంది. ఇందులో కీ రోల్ పోషించింది. దీనిని నాగవంశీ నిర్మించాడు. కళ్యాణ్ శంకర్ తీశాడు. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో నార్నే నితిన్ కు కూడా మంచి పేరు వచ్చింది.
ఆ తర్వాత వస్తున్న తదుపరి చిత్రం శ్రీశ్రీ రాజా వారు కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మంచి ఫీల్ గుడ్ అనిపించేలా ఉంది. ఇక టేకింగ్ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సతీశ్ వేగేశ్న గురించి.
సరదా సంభాషణలు, అద్భుతమైన సన్నివేశాలు, హృదయాలను దోచుకునేలా పాటలు తప్పకుండా ఉంటాయి. ఇందులో నితిన్ సరసన సంహిత కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీ దేవాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. యూత్ ఫుల్ , యాక్షన్ , ఎంటర్ టైనర్ జానర్ లో తీసేందుకు ప్రయత్నం చేశాడు దర్శకుడు.
