Natural Star Nani: యాక్షన్‌ జోనర్ లో నేచురల్ స్టార్ నాని ?

యాక్షన్‌ జోనర్ లో నేచురల్ స్టార్ నాని ?

Hello Telugu - Natural Star Nani

Natural Star Nani: మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి వంటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ. ‘అంటే సుందరానికి’ సినిమాతో నేచురల్ స్టార్ నానికు బాగా దగ్గరయిన వికేక్ ఆత్రేయ… వరుసగా అతనితో రెండో సినిమాను ప్రారంభించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా… బుధవారం నుండి హైదరాబాద్‌లో ఓ లెంగ్తీ షెడ్యూల్‌ను ప్రారంభించుకున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. అంతేకాదు ఈ షెడ్యూల్ ప్రారంభమైనట్లుగా తెలుపుతూ… ఓ ఫోటోని కూడా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతోంది.

Natural Star Nani in Action Zoner

చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫోటో ను బట్టి ఈ సినిమా నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు అన్‌చెయిన్డ్ వీడియోలో చూపించినట్లుగా, నాని(Nani) ఈ సినిమాలో రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఫోటోలో ఫేస్‌‌లు క్లారిటీగా లేనప్పటికీ… ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ లెన్తీ షెడ్యూల్‌లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌లతో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్‌ని చిత్రీకరించనున్నట్లు సమాచారం. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా మురళి జి , ఎడిటర్ గా కార్తీక శ్రీనివాస్ పనిచేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read : Sivakarthikeyan: సినిమా కోసం పారితోషకాన్ని వదులుకున్న శివకార్తికేయన్‌

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com