భారతీయ సినీ దర్శకులలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కలిగిన ఏకైక దర్శకుడు మణిరత్నం. తను కొంత కాలం గ్యాప్ తర్వాత పొన్నియన్ సెల్వన్ తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ తీశాడు. అది కూడా హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది బాలీవుడ్ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్. తనను సినిమాకు తమిళంలో పరిచయం చేశాడు మణిరత్నం. తన మాట కాదనలేక పోయింది. ఇందులో కీలక పాత్ర పోషించింది. ఆమెను అద్భుతంగా తెర మీద మరోసారి ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.
ఇదే సమయంలో తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ , సిలాంబరసన్ , త్రిష కృష్ణన్ తో కలిసి థగ్ లైఫ్ తీశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. సినిమాకు సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రధానంగా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో చిత్రీకరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇందులో త్రిష కృష్ణన్, కమల్ హాసన్ కలిసి చేసిన ముద్దు సీన్ వివాదాస్పదంగా మారింది.
ఇదిలా ఉండగా మణిరత్నం థగ్ లైఫ్ తర్వాత మరో కొత్త ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కు చెందిన యంగ్ హీరో నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ హీరో ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నవీన్ పోలీశెట్టిని ఎంచుకున్నట్లు సమాచారం. నవీన్ కు మంచి ఆదరణ ఉంది ఫ్యాన్స్ లలో. ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ఇదే గనుక నిజమైతే తనకు గొప్ప ఛాన్స్ వచ్చినట్టేనని చెప్పక తప్పదు.
