Nayanthara Annapoorni : సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది నయనతార. తను ఇటీవలే బాద్ షా షారుక్ ఖాన్ తో జవాన్ లో పోటా పోటీగా నటించింది. తాజాగా తను కీలక పాత్రలో నటించిన అన్నపూర్ణి ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Nayanthara Annapoorni Updates
ఇందులో భాగంగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. అన్నపూర్ణి మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారని , జవాన్ ను ఆదరించినట్లుగానే ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరారు నయన తార(Nayanthara). సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
తన కెరీర్ లో మనసు పెట్టి చేసిన మూవీ అన్నపూర్ణి అని తెలిపింది. చాలా సినిమాలు చేసినా ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని తెలిపింది నయనతార. అన్ని వర్గాల వారిని తప్పకుండా ఈ చిత్రం అలరిస్తుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.
ఇందులో శాఖాహారం, మాంసాహార వంటకాలను వివరించే ప్రయత్నం చేశానని , ఇదే తన పాత్ర అంటూ స్పష్టం చేసింది. ఈ సినిమాను శ్రీరంగం, తిరుచ్చిలో చిత్రీకరించారని వెల్లడించింది నయనతార.
Also Read : Thalapathy Vijay : ఏళ్లవుతున్నా వన్నె తగ్గని అందం
