మెగాస్టార్ సినీ కెరీర్ లో 157వ చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే తన సరసన మరోసారి నటించ బోతోంది తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన నయన్. దీనికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఇప్పటిన ఉంచే మొదలయ్యాయి. తనకు మినిమం గ్యారెంటీ కలిగిన డైరెక్టర్ గా గుర్తింపు ఉంది. ఈ ఏడాది తన సినీ కెరీర్ లో అంతకు మించి విక్టరీ వెంకటేశ్ సినీ ప్రస్థానంలో అత్యధిక వసూళ్లు సాధించేలా సంక్రాంతికి వస్తున్నాం తీశాడు.
దీనిని నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. తనకు ఈ ఏడాది ఒకటి ప్లస్ కాగా రెండోది మైనస్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో తీసిన గేమ్ ఛేంజర్ బొక్క బోర్లా పడింది. మెగా స్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినా వర్కవుట్ కాలేదు. దీన్ని బట్టి స్టార్స్ కంటే కంటెంట్ ఉంటేనే జనం ఆదరిస్తారని తేలి పోయింది. వెంకీ మామ మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇదిలా ఉండగా మెగాస్టార్ మూవీ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గార్లపాటి, సుష్మితా గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ తోడ్పాటుతో అర్చన సమర్పిస్తోంది. సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే చిత్ర బృందం హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఇక రెండో షెడ్యూల్ ను ముస్సోరీలో కొనసాగుతుందని అధికారికంగా వెల్లడించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ చిత్రానికి బీమ్స్ సిసిలిరియో సంగీతం అందిస్తుండడం విశేషం.
