Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, మినిమం గ్యారెంటీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు పనులు చకచకా కొనసాగుతున్నాయి. అయితే చిరంజీవి(Chiranjeevi)తో ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారనే దానిపై టాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొందరేమో అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్షన్ అని, మరికొందరేమో కాదు లేడి అమితాబ్ గా గుర్తింపు పొందిన నయన తార నటించనుందని టాక్. ఇది పక్కన పెడితే ఇప్పటికే ఈ మూవీపై నమ్మకం పెట్టుకున్నాడు సూపర్ స్టార్.
Chiranjeevi-Anil Ravipudi Movie Updates
తను ప్రస్తుతం నటించిన విశ్వంభర రిలీజ్ కు సిద్దంగా ఉంది. చిరంజీవి ఓ వైపు ఈవెంట్స్ కు అటెండ్ అవుతూనే మరో వైపు కొత్త మూవీస్ పై దృష్టి సారించాడు. అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను ఏది తీసినా అది బ్లాక్ బస్టర్ అవుతోంది. తాజాగా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్బంగా రిలీజ్ అయిన విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రలలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం భారీ వసూళ్లను సాధించింది. ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
ఇదే సినిమాతో పాటు మరో రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ కాగా మరో మూవీ బాలయ్య నటించిన డాకు మహారాజ్. బాలయ్య, వెంకీ మూవీస్ సూపర్ హిట్ టాక్ అందుకుంటే చెర్రీ మూవీ బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక పోతే మెగాస్టార్, రావిపూడి కాంబో మూవీలో హీరోయిన్ గా నయన్ నటిస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇందు కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.
Also Read : Beauty Samantha- Shubham :పేరుకేమో శుభం చిత్రం అంతా భయం