టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడు అనిల్ రావిపూడి. మనోడి డైరెక్షన్ సింప్లీ సూపర్ గా ఉంటుంది. డైలాగులు, టేకింగ్ లో తనది డిఫరెంట్. ఇక కథను ఎంచుకోవడం, సినిమా ను జనరంజకంగా మల్చడంలో తనకు తానే సాటి అని పేరు తెచ్చుకున్నాడు. తీసిన ప్రతి మూవీ గ్యారెంటీగా సక్సెస్ అయ్యేలా జాగ్రత్త పడుతూ వచ్చాడు. అంతెందుకు ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి చెందిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన గేమ్ ఛేంజర్ నిర్మాత పీకల లోతు కష్టాల్లోకి కూరుకు పోయాడు. దీంతో తనను నమ్మి ఇన్వెస్ట్ చేసిన దిల్ రాజుకు ఈ ఏడాది ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు.
నవ్వుల పంట పండించాడు. కాసుల వర్షం కురిపించేలా చేశాడు. ఒకటా రెండా ఏకంగా విక్టరీ వెంకటేశ్ సినీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా సంక్రాంతికి వస్తున్నాం తీశాడు. ఈ మూవీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో దిల్ రాజు ఊపిరి పీల్చుకున్నాడు. తన బ్యానర్ నుంచి రౌడీ జనార్దన్ తీస్తున్నాడు.
దీనిని పక్కన పెడితే తాజాగా వెంకీ మూవీ సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో మూవీని స్టార్ట్ చేశాడు. ఇందులో కీ రోల్ పోషిస్తోంది తమిళ సినీ బ్యూటీ నయనతార. దీనిని పూర్తిగా స్టార్ ఇమేజ్ కు భంగం కలగకుండా కామెడీ , సస్పెన్స్, రొమాంటిక్ కథాంశంగా ఉండేలా ఫోకస్ పెడుతున్నాడు అనిల్ రావిపూడి. తాజాగా మెగాస్టార్ తో తీస్తున్న మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేశాడు. దీనికి మెగా 157 అని తాత్కాలికంగా పేరు పెట్టాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే. మరి రిలీజ్ అయ్యాక ఇంకెంత రికార్డు బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.