Nazriya Nazim : మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నజ్రియా నజీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను మన్నించాలని కోరింది. ఇదే సమయంలో ఈసారి కేరళ ప్రభుత్వం ప్రకటించిన సినీ అవార్డులలో అత్యుత్తమ నటన ప్రదర్శించినందుకు ఉత్తమ నటి కేటగిరీలో ఎంపికైంది. సీఎం పినరయ్ విజయన్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంది. ఈ సందర్బంగా స్పందించింది. జీవితంలో మరిచి పోలేని గుర్తింపు ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఏదో ఒక రోజు ఉత్తమ నటిగా ఎంపికవుతానన్న నమ్మకం ఉండేదని, ఇవాళ ఆ కల తీరిందన్నారు.
Nazriya Nazim Comments
అయితే గత కొంత కాలం నుంచి తాను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం పట్ల కొంత బాధ పెట్టానని, తనను సహృదయంతో మన్నించాలని వేడుకుంది. ఏ స్థాయిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ప్రత్యేకించి సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, కార్పొరేట్ రంగాలలో కీలకమైన వ్యక్తులంతా నిరంతరం ఒత్తిళ్లను ఎదుర్కొంటారని ఇది సహజమనేనని పేర్కొంది నటి నజ్రియా నజీబ్(Nazriya Nazim). తన భర్త ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. తను సహజ నటనకు పెట్టింది పేరు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్తలు నెలకొన్నాయని, అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిందని నెటిజన్లు పేర్కొన్నారు.
ఉత్తమ అవార్డును అందుకోవడం తనపై మరింత బాధ్యతను పెంచేలా చేసిందన్నారు. తను మలయాళ సినిమాలతో పాటు టాలీవుడ్ లో కూడా నటించింది. రాజా రాణి మూవీతో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన అంటే సుందరానికి మూవతో మరింత దగ్గరైంది. నేరం, బెంగళూరు డేస్, కూడే, కుంబలంగి నైట్స్, తదితర సినిమాలతో నటనా పరంగా మంచి మార్కులు కొట్టేసింది నజ్రియా నజీబ్. ఇక తను మలయాళంలో నటించిన సూక్ష్మ దర్శిని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత తను అందరికీ దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు మరోసారి రంగంలోకి రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : Hero Jr NTR-Prasanth Neel :ప్రశాంత్ నీల్ డ్రాగన్ నిర్మాణంలో టీ సీరీస్