ఇద్దరూ ఇద్దరే. ఒకరు దిగ్గజ నటుడు, జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న అల్లు అర్జున్. మరొకరు క్రియేటివిటీనే కాదు దమ్మున్న దర్శకుడిగా పేరు పొందాడు నెల్సన్ దిలీప్ కుమార్. తమిళ సినీ ఇండస్ట్రీలో అత్యంత జనాదరణ కలిగిన సినిమాలను తీయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్.
తాజాగా తను సూపర్ స్టార్ రజనీకాంత్ తో తీసిన జైలర్ ఏకంగా రూ. 650 కోట్లు దాటేసింది. చాలా గ్యాప్ తర్వాత తలైవాకు ఆశించిన దాని కంటే సక్సెస్ ఇచ్చింది. ప్రత్యేకించి టేకింగ్, మేకింగ్ , మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. జైలర్ రికార్డుల మోత మోగించింది.
ప్రస్తుతం తమిళ సినీ రంగానికి చెందిన లోకేష్ కనగరాజ్ , అట్లీ కుమార్ , నెల్సన్ దిలీప్ కుమార్ , కార్తీక్ సుబ్బరాజ్ , జ్ఞాన వేల్ , ఇలా ప్రతి ఒక్కరూ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. తాజాగా బన్నీతో నెల్సన్ దిలీప్ కుమార్ కొత్త సినిమా చేయబోతున్నట్లు టాక్.
మరో వైపు అల్లు అర్జున్ తో నెల్సన్ తో పాటు అట్లీ కుమార్ కూడా సినిమా తీసేందుకు చర్చించినట్లు సమాచారం. అయితే ఇద్దరి భేటీపై ఎవరూ కూడా స్పందించక పోవడం విశేషం.