New Song : కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం సింగిల్. ఈ మూవీలో శ్రీ విష్ణు హీరో కాగా కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో కీ రోల్ పోషిస్తున్నాడు వెన్నెల కిషోర్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా సింగిల్ మూవీ నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు. సింగిల్ గా ఉంటే బతుకంతా సిరాకైంది అంటూ పాటను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తప్పదు మందు గ్లాస్ మనకు అనే పల్లవి ఆకట్టుకునేలా ఉంది.
New Song ‘Single ga Unte Bathuku Sirake’ Song Viral
ఈ పాటను గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాట అన్ని వర్గాలను ఆకట్టుకునేలా, క్యాచీగా ఉంది. దీనిని రాహుల్ సిప్లిగంజ్ పాడగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. అమ్మాయిల గురించి కూడా ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. యూత్ ను కనెక్ట్ చేసేలా ఉంది ఈ సాంగ్. ఇదిలా ఉండగా ఈ సినిమాపై కీలక అప్ డేట్ వచ్చింది.
ఈ చిత్రాన్ని వచ్చే నెల మే 9వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. విచిత్రం ఏమిటంటే పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు రిలీజ్ కానుంది. దీనిని ప్రతిష్టాత్మకంగా ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Beauty Tamannaah-Odela 2 :తమన్నా ఓదెల2కు మిశ్రమ స్పందన