త‌ళుక్కుమ‌న్న నిధి అగ‌ర్వాల్

రాజా సాబ్ టీజ‌ర్ లో హ‌ల్ చ‌ల్

అందాల ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్ హాట్ టాపిక్ గా మారింది. త‌ను కీ రోల్ పోషించిన చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వ‌స్తోంది ఈ చిత్రం. దీనిపై భారీ ఆశ‌లు పెట్టుకుంది. కానీ ఎంత‌కూ రావ‌డం లేదు. ఇందులో న‌టించింది ఎవ‌రో కాదు సూప‌ర్ స్టార్ హీరో. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్ కొణిద‌ల‌. ఈ చిత్ర నిర్మాత ఎంఎం ర‌త్నం నానా తంటాలు ప‌డుతున్నాడు రిలీజ్ చేసేందుకు. కానీ బ‌య్య‌ర్స్ , డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌నీసం ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తే త‌న‌కు మంచి బ‌జ్ వ‌స్తుంద‌ని ఆశ ప‌డింది ల‌వ్లీ బ్యూటీ నిధి అగ‌ర్వాల్.

త‌ను ప‌లు సినిమాల్లో న‌టించింది. త‌న‌ను ఏరికోరి తీసుకున్నారు హ‌రి హ‌ర వీర‌మ‌ల్లులో. ఇది ప‌డుతూ లేస్తూ వ‌చ్చింది. మొద‌ట క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏమైందో ఏమో కానీ త‌ప్పుకున్నాడు. ఆయ‌న స్థానంలో చివ‌ర‌కు నిర్మాత ర‌త్నం సోద‌రుడి త‌న‌యుడు జ్యోతి కృష్ణ‌ను డైరెక్ట‌ర్ గా ఎంపిక చేశాడు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసినా ఇంకా ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. దీంతో తీవ్ర నిరాశ‌కు లోనైంది. కానీ తాజాగా త‌ను న‌టించిన మ‌రో మూవీ రాజా సాబ్ ప్రేక్ష‌కుల ముందుకు టీజ‌ర్ రూపంలో వ‌చ్చేసింది.

భారీ ఎత్తున ఆద‌రిస్తున్నారు. ద‌ర్శ‌కుడు మారుతి హార‌ర్, కామెడీ , రొమాంటిక్ నేప‌థ్యంలో చిత్రాన్ని తీశాడు. ఇప్ప‌టికే దాదాపు 90 శాతానికి మించి పూర్త‌యింద‌ని తెలిపాడు. అంతే కాదు డిసెంబ‌ర్ లో పండుగ చేసుకోవాలంటూ ఫ్యాన్స్ కు తీపి క‌బురు చెప్పాడు. త‌ను ప్ర‌క‌టించిన‌ట్టుగానే ఇవాళ వ‌చ్చిన టీజ‌ర్ కెవ్వు కేక అనిపించేలా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు. ఇందులో కీ రోల్ పోషించింది నిధి అగ‌ర్వాల్. త‌న‌తో పాటు మాళ‌విక మోహ‌న్ కూడా మెరిసింది. మొత్తంగా రాజా సాబ్ రూపంలో నిధికి మంచి పేరు రావాల‌ని ఆశిద్దాం.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com