Niharika : నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాబాయ్ హీరో. డిప్యూటీ సీఎం. తండ్రి ఎమ్మెల్సీ, హీరో, రియాల్టీ షోకు జడ్జి కూడా. ఈ మధ్యన నటనతో పాటు నిర్మాతగా మారింది నిహారిక. తను భిన్నంగా ఉంటుంది. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేస్తుంది. ఎవరినీ కేర్ చేయదు. తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. ఆ మధ్యన మంచి కంటెంట్ ఉన్న కథలకు ప్రయారిటీ ఇస్తోంది. ఇదే సమయంలో తను కమిటీ కుర్రోళ్ల పేరుతో సినిమా నిర్మించింది. ఇది ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ గా నిలిచింది. టాప్ హీరోలను తట్టుకుని నిలబడింది.
Niharika Konidela Movie with Santhosh Shobhan
ఇదే సమయంలో తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. కాగా సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నాగ వంశీ మ్యాడ్ సీక్వెల్ మూవీ నిర్మించాడు. దీనికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో కీ రోల్ పోషించాడు సంతోష్ శోభన్(Santhosh Shobhan). గతంలో తను పలు పాపులర్ వెబ్ సీరీస్ లలో నటించి మెప్పించాడు. మ్యాడ్ తో పాటు సీక్వెల్ చిత్రంలో సైతం తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. దీంతో తననే హీరోగా పెట్టి మరో మూవీకి రెడీ అయ్యింది కొణిదల నిహారిక(Niharika Konidela). పూర్తిగా కథ, టేకింగ్ డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్త పడుతోంది.
మంచి కథ ఆకట్టుకునేలా ఉంటే సినిమా సక్సెస్ అవుతుందని ఆమె నమ్ముతోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. తను కూడా ఓ మూవీలో నటించింది. తన ఆధ్వర్యంలోనే ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. అదే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ . ఇదే బ్యానర్ పై సంతోష్ శోభన్ తో రెండో సినిమా తీసేందుకు రెడీ అయ్యింది. ఇక విచిత్రం ఏమిటంటే ఓ మహిళా డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తను గతంలో జీ5, పింక్ ఎలిఫెంట్ మూవీస్ కు రైటర్ గా పని చేసిన అనుభవం ఉంది. సోని లివ్ తీసిన బెంచ్ లైఫ్ కి దర్శకురాలిగా పని చేసింది. ఈ కొత్త మూవీపై అప్పుడే అంచనాలు పెరిగేలా చేశాయి.
Also Read : Hero Chiranjeevi : వచ్చే సంక్రాంతిన రఫ్పాడిస్తాం