Thammudu : యంగ్ హీరో నితిన్ రెడ్డి తాజాగా నటిస్తున్న చిత్రం తమ్ముడు(Thammudu) షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సందర్బంగా కీలక అప్ డేట్ వచ్చింది. ఈ మూవీని వచ్చే జూలై 4వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు నిర్మాత. ఇందుకు సంబంధించిన స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది నితిన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది.
Hero Nithin-Thammudu Movie Updates
వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం రాబిన్ హుడ్ . ఇందులో లవ్లీ బ్యూటీ శ్రీలీల నటించినా వర్కవుట్ కాలేదు. బ్యాడ్ టైమ్ నడుస్తుందని చెప్పక తప్పదు. ఓ వైపు మూవీ డిజాస్టర్ గా నిలిచినా నితిన్ రెడ్డికి వరుసగా సినిమా ఆఫర్స్ వస్తుండడం విస్తు పోయేలా చేస్తోంది. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ, స్వస్తిక విజయన్, సీనియర్ నటి లయ, బేబీ శ్రీరామ్ ఆదిత్య నటిస్తున్నారు.
నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితిన్ తో తీస్తున్న తమ్ముడు మూవీ వెరీ స్పెషల్ గా ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లోకి రానుంది. తను అమెరికా నుంచి తిరిగి ఇక్కడికి రావడం, మరోసారి నటించాలని కోరికను వ్యక్తం చేయడంతో దర్శక, నిర్మాతలు ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ కేవీ గుహన్ అందించగా సంగీతం అజనీష్ లోకనాథ్ అందించారు.
Also Read : Chary 111 Sensational :అమెజాన్ ప్రైమ్ లో చారీ 111 హల్ చల్
