Hero Nithin-Robinhood :జీ 5లో నితిన్ శ్రీ‌లీల మూవీ స్ట్రీమింగ్

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

Robinhood : నితిన్ రెడ్డి హీరోగా శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించిన చిత్రం రాబిన్ హుడ్(Robinhood). ఈ మ‌ధ్య‌నే విడుద‌లైంది. దీనికి వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వహించారు. త‌ను నితిన్ , ర‌ష్మిక మంద‌న్నాతో క‌లిసి వెంకీ భీష్మ తీశాడు. ఆ సినిమాకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. కానీ ఏమైందో ఏమో కానీ నితిన్ ఏది న‌టించినా అది డిజాస్ట‌ర్ గా మిగిలి పోతోంది. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక పోవ‌డం, న‌ట‌నా ప‌రంగా ఆశించిన మేర‌కు రాణించ‌క పోవ‌డం, పేల‌వ‌మైన ద‌ర్శ‌క‌త్వం వెర‌సి సినిమాను గ‌ట్టెక్కించ‌లేక పోయాయి.

Robinhood Movie OTT Updates

త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు జీవి ప్ర‌కాశ్ కుమార్ ప‌నిత‌నం వ‌ర్క‌వుట్ కాలేదు. ఒక‌టి రెండు పాట‌లు మిన‌హా ఆక‌ట్టుకోలేక పోయాయి. మార్చి 28న రిలీజ్ అయ్యింది రాబిన్ హుడ్. ఇందులో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు ప్ర‌ముఖ ఆసిస్ క్రికెట‌ర్ వార్న‌ర్. ఇక ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5 కొనుగోలు చేసింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మే 10వ తేదీన ఇటు జీ తెలుగుతో పాటు అదే రోజు సాయంత్రం స్ట్రీమింగ్ చేస్తామ‌ని తెలిపింది. దీంతో ఫ్యాన్స్ కు పండ‌గేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇటీవ‌లే స‌ద‌రు సంస్థ ఊహించ‌ని ధ‌ర‌కు కొనుగోలు చేసింది సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రాన్ని. దీనిని దిల్ రాజు నిర్మించాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా విక్ట‌రీ వెంక‌టేశ్, ఐశ్వ‌ర్య రాజేష్, మీనాక్షి చౌద‌రి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇది ఊహించ‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించింది. దీనిని స్వంతం చేసుకున్న జీ 5 ఇటు జీ తెలుగు చాన‌ల్ లోనూ ఇటు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసింది ఒకేరోజు. మంచి వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇక రాబిన్ హుడ్ ను ఆద‌రిస్తారో లేదో చూడాలి.

Also Read : Faria Abdullah Shocking :ప‌వ‌న్ తో డేటింగ్..నాగ్ తో ల‌వ్..ప్ర‌భాస్ తో పెళ్లి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com