Nivin Pauly : తాను ఏ తప్పు చేయలేదంటూ పోలీసులకు ఆధారాలు చూపిన నవీన్ పౌలీ

యువతి ఫిర్యాదులో పేర్కొన్న తేదీన నివిన్ పౌలీ వాస్తవానికి ఇండియాలోనే ఉన్నాడు...

Hello Telugu - Nivin Pauly

Nivin Pauly : హేమ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమలో పెను దుమారాన్ని సృష్టించింది. పలువురు సీనియర్ నటులు, దర్శకులపై ఆరోపణలు ఎత్తున వినిపిస్తున్నాయి. లైంగిక వేధింపుల కేసుల్లో కొందరిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని కొందరు నటీమణులు, యువతులు సెలబ్రిటీలపై తప్పుడు కేసులు పెట్టడం మొదలుపెట్టారు. కొంత మంది బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం, హేమ నివేదిక విడుదలైనప్పుడు, ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీ(Nivin Pauly)పై ఒక యువతి లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. కేరళలోని ఎర్నాకులం ఒన్నుకుల్‌లో నివాసముంటున్న యువతి సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనపై నివిన్‌ పౌలీ, నిర్మాత, దర్శకుడు తదితరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది.

Nivin Pauly Comment

దుబాయ్‌లోని ఓ హోటల్‌లో అత్యాచారం జరిగిందని పేర్కొన్న యువతి ఫిర్యాదులో తేదీని కూడా నమోదు చేసింది. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్ షేర్ చేసిన నివిన్ పౌలీ.. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పడమే కాకుండా.. అవి అబద్ధమని నిరూపించేందుకు తాను ఏమైనా చేస్తానని, అబద్ధాలు చెప్పేవారిని వదలబోనని చెప్పాడు. అతని పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తారు అని ఫ్యాన్స్ అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు నివిన్ పౌలీ కొన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించాడు.

యువతి ఫిర్యాదులో పేర్కొన్న తేదీన నివిన్ పౌలీ(Nivin Pauly) వాస్తవానికి ఇండియాలోనే ఉన్నాడు.అప్పుడు అతను దుబాయ్ వెళ్ళలేదు. దీనికి సంబంధించి నివిన్ పౌలీ తన పాస్‌పోర్ట్ పత్రాల కాపీని పోలీసులకు అందించాడు. అంతే కాదు ఫిర్యాదు చేసిన యువతిపై కౌంటర్ దాఖలు చేసిన నివిన్ పౌలీ.. పరువునష్టం కేసు కూడా పెడతానని తెలిపాడు. అయితే పాస్‌పోర్టు విషయమై మాట్లాడిన ఆ యువతి.. ‘ఫిర్యాదులో నేను ఏ తేదీని నమోదు చేయలేదు. కానీ మీడియాతో మాట్లాడుతూ తేదీని ప్రస్తావించాను, కానీ తేదీని తప్పుగా పేర్కొన్నాను. నిద్ర మత్తులో ఉండటంతో ఆ తేదీని ప్రస్తావించాను. ఇప్పుడు పోలీసులకు వేరే తేదీ చెప్పాను. ఎలాగోలా నివిన్ పౌలీ పాస్ పోర్ట్ ఇచ్చాడు. నా పాస్‌పోర్ట్ కూడా పోలీసులకు ఇచ్చాను. పోలీసులు విచారణ కొనసాగించనివ్వండి అని ఆ యువతి చెప్పుకొచ్చింది. మరి ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

Also Read : Alia Bhatt : అలియా నటనపై కల్కి డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com