Hero Jr NTR-War 2 :తార‌క్ వార్ 2 మూవీ సాంగ్ పై ఫోక‌స్ 

అంచ‌నాలు పెంచుతున్న మూవీ 

Hero Jr NTR-War 2

War 2 : పాన్ ఇండియా స్టార్లు ఆ ఇద్ద‌రు. ఇంకేం వీరు క‌లిస్తే ఆ సినిమా ఎలా ఉండ‌బోతోందో త‌ల్చుకుంటేనే ఉత్కంఠ క‌లుగుతుంది. వారిలో ఒక‌డు హృతిక్ రోష‌న్. ఇండియ‌న్ రాబిన్ హుడ్ . త‌ను క‌ల‌ల రాకుమారుడు. ఎక్క‌డా ప‌బ్లిసిటీ కోసం పాకులాడే మ‌నిషి కాడు. త‌న ప‌నేదో తాను చేసుకుంటూ పోయే రకం. ఇంకొక హీరో గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌రిచ‌యం కూడా చేయాల్సిన ప‌నిలేదు. న‌ట‌న‌తోనే కాదు డ్యాన్సుల‌తో హోరెత్తించే డైన‌మిక్ , డాషింగ్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్. త‌ను ఇప్పుడు టాప్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తీస్తున్న డ్రాగ‌న్ లో న‌టిస్తున్నాడు.

Jr NTR War 2 Movie Updates

ఇదే స‌మ‌యంలో హిందీలో నేరుగా వార్ -2(War 2)లో కీల‌క పాత్ర పోషిస్తుండ‌డంతో అంచ‌నాలు ఈ మూవీపై భారీగా పెరిగాయి. త‌ను కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన మూవీ దేవ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దేశ వ్యాప్తంగా వసూళ్ల వ‌ర్షం కురిపించేలా చేసింది. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా వార్ 2 సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ అటు నీల్ తో ఇటూ ఈ మూవీ సాంగ్ కోసం ప్లాన్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ లో టాక్.

ఈ చిత్రాన్ని య‌శ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు వార్ -2ను. సినిమా వ‌ర‌కు షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింద‌ని బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తోంది. అయితే సినిమాకు సంబంధించి కీల‌క‌మైన సాంగ్ ను మాత్ర‌మే చిత్రీక‌రించాల్సి ఉంద‌ని, దాని కోసం ప్లాన్ కూడా చేసిన‌ట్లు టాక్. ఇటీవ‌ల ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో హృతిక్ రోషన్ కు గాయం కావ‌డంతో కొంత ఆల‌స్యం జ‌రిగింది. ఇప్ప‌టికే వార్ 2ను ఆగ‌స్టు 14న రిలీజ్ చేస్తామ‌ని  ముందుగానే ప్ర‌క‌టించారు. కాగా గాయం త‌గ్గాక జూన్ నెల‌లో సాంగ్ ను రోష‌న్, ఎన్టీఆర్ తో పాటు మ‌రికొంద‌రిపై చిత్రీక‌రించ‌నున్నారు.

Also Read : Hero Vijay-Kingdom :విజ‌య్ కింగ్ డ‌మ్ పై వార్ ఎఫెక్ట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com