NTR-Tripti Dimri: ఎన్టీఆర్‌ పై మనసుపడ్డ యానిమల్ బ్యూటీ

ఎన్టీఆర్‌ పై మనసుపడ్డ యానిమల్ బ్యూటీ

Hello Telugu - NTR-Tripti Dimri

NTR-Tripti Dimri: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన ‘యానిమల్‌’ సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది నటి ‘త్రిప్తి డిమ్రీ’. జోయా పాత్రలో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ… తాజాగా ఐఎండీబీ (ఇండియన్‌ మూవీ డేటాబేస్‌) విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో తన ఇన్ స్టాలో 30 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ‘యానిమల్‌’ సినిమాకు ముందు ఆమె ఫాలోవర్స్‌ ఆరు లక్షలమంది కాగా… ఆ చిత్రం విడుదలైన తరువాత ఆ సంఖ్య 36 లక్షలకు పెరిగింది.

‘యానిమల్‌’ సినిమాలో నేషనల్‌క్రష్‌ రష్మికా మందన్నాతో కలిసి సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి… సినిమాలో రష్మిక కంటే మంచి గుర్తింపు పొందడమే కాకుండా తాజా నేషనల్ క్రష్ త్రిప్తియే అంటూ నెటిజన్ల నుండి ప్రశంసలు అందుకుంటోంది. దీనితో పలు సౌత్ సినిమాల్లో త్రిప్తి డిమ్రీకు(Tripti Dimri) అవకాశాలు క్యూ కట్టాయనే టాక్ నడుస్తోంది. దీనితో పలు సౌత్‌ సినిమాల్లో తాను ఎంపికయ్యానంటూ వస్తోన్న వార్తలపై త్రిప్తి స్పందించారు.

NTR-Tripti Dimri Viral

ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి త్రిప్తి మాట్లాడుతూ ‘నేను ఇప్పటి వరకు ఏ దక్షిణాది సినిమాకు సంతకం చేయలేదు. సౌత్‌లోనూ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. నాకు జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఉంది’ అని మనసులోని మాట వెల్లడించింది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా త్రిప్తికి మద్దత్తు తెలుపుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్‌ కాంబోలో రానున్న సినిమాలో త్రిప్తిని తీసుకోవాలంటూ కొంతమంది అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read : Rajinikanth: రజనీకాంత్ కొత్త సినిమా వేటగాడు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com