Devara : అతి ఉత్సాహంతో ఎన్టీఆర్ ‘దేవర’ కటౌట్ దగ్ధం అభిమానులు

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...

Hello Telugu - Devara

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర(Devara)’ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి ఒంటి గంట‌కు ప్రీమియర్ షోలు ప్రారంభ‌మైన ఈ సినిమాకి ప్రేక్ష‌కుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌స్తోంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమా విడుదలైనప్పుడల్లా అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తుంటారు. కానీ వారి మితిమీరిన ఉత్సాహం కొన్నిసార్లు థియేటర్లలో ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఘటనే ఈ రోజు హైదరాబాద్‌లోని RTC X రోడ్స్‌లోని సుదర్శన్ 35MM థియేటర్‌ వద్ద చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే..

Devara Cutout Fire..

‘దేవర’ విడుదల సందర్భంగా థియేటర్ ఆవరణలో అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, ఎన్టీఆర్ కటౌట్‌కు మంటలు అంటుకుని దగ్ధం కావడంతో పాటు కొద్దిసేపటికే మంటలు చుట్టూ భారీగా చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కటౌట్‌పై ఉన్న పూలదండల మధ్య పటాకులు కాల్చడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ ఆచార్య’ తర్వాత కొరటాల శివ నుంచి వచ్చిన చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై అందోళన చెందినప్పటికీ.. గతంలో ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్’ హిట్ అవడంతో పాటు, ఎన్టీఆర్‌తో కొరటాలకు ఉన్న అనుబంధం దృష్ట్యా అభిమానులు ఈ సినిమాపై నమ్మకంగానే ఉన్నారు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలిసారిగా తెలుగులోకి అడుగుపెట్టడంతో ఫ్యాన్స్‌లో ఆశలు మరింత పెరిగాయి. రూ. 300 కోట్లతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ చేశారు. వీరితో పాటు శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Bhale Unnade OTT : ఓటీటీకి రాజ్ తరుణ్ రొమాంటిక్ మూవీ ‘భలే ఉన్నాడే’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com